కాలువను తలపిస్తున్న రహదారి

– చినుకు పడితే ఈ రహదారిలో
– వాహనదారులకు తిప్పలు తప్పవు
 – నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న అధికారులు
– ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజలు

నవతెలంగాణ-వనస్థలిపురం
బి.యన్‌ రెడ్డి నగర్‌ డివిజన్‌ పరిధిలోని సాహెబ్‌ నగర్‌ రహదారి నుంచి ఇంజాపూర్‌ వెళ్లే రహదారి జిక్కిడి రాంరెడ్డి కమాన్‌ ముందు క్రిస్టల్‌ వెంచర్‌ ముందు దిగువ ప్రాంతం అవటంతో చినుకు పడితే ఆ ప్రాంతం కాలువను తలపిస్తోంది. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్‌లో ప్రజలు నిత్యం ఇంజాపూర్‌ నుంచి ఇబ్రహీం పట్నం వెళ్లాలంటే ఈ రహదారి నుంచి ప్రయాణించ వలసిందే. ఎన్నో రోజులుగా ఈ రహదారి చినుకులు పడితే చాలు ఎగువు ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు రోడ్డుపై నిలుస్తోంది. దాంతో ద్విచక్ర వాహనదారులు పలు ఇబ్బం దులతో పాటు, ప్రమాదాలకు గురవుతున్నారు. వాటర్‌ వర్క్స్‌, డ్రయినేజీ గతంలో విడివిడి విభాగాలుగా విధులు నిర్వహించే అధికారులు ప్రస్తుతం డ్రయినేజీ వ్యవస్థని వాటర్‌ వర్క్స్‌ వ్యవస్థలోకి విలీనం చేయటంతో పలు ఇబ్బం దులు గురవుతున్నామని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. కాలనీ వాసులు ఆ రోడ్డు నుంచి వెళ్లాలంటే భయభ్రాం తులకు గురవుతున్నారు. అయితే ప్రమాదానికి కారణమ వుతున్నా ఆ రహదారి గురించి అధికారులు పట్టించుకో వట్లేదని పలువురు ఆరోపిస్తున్నారు. స్థానిక కార్పొరేటర్‌ మొద్దు లచ్చి రెడ్డి చొరవ తీసుకుని ఆ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు, ప్రజలకు ఇబ్బందిగా తయారైన ఈ రహదారి సమస్యను పరిష్కరించాలని ఆయా కాలనీవాసులు, వాహనదారులు కోరుతున్నారు.