కిస్మత్పూర్‌లో మల్లన్న గుడికి వెళ్లే రహదారిని కబ్జా నుండి కాపాడాలి

రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు వినతి
నవతెలంగాణ-గండిపేట్‌
కిస్మత్పూర్‌ గ్రామం మల్లన్న గుడి కెళ్ళే రహదారిని కబ్జా నుండి కాపాడాలని బీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. గురువారం బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కిస్మత్పూర్‌, దర్గా కలియఖాన్‌ గ్రామాలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. సర్వే నెంబరు 107లో 50 ఏండ్ల కిందట మల్లన్న గుడిని ఏర్పాటు చేశామన్నారు. 106 107 సర్వే నెంబర్లు గుడి వెళ్లే రహదారిలో ప్రభుత్వ భూమిని కలుపుకొని వినోద్‌ కుమార్‌ అనే వ్యక్తి పాత లేఔట్‌ను 25 సంవత్సరాలు కింద చేసినట్లు తెలిపారు. ఇందులో 50 ఫీట్లు 30 ఫీట్ల రోడ్డు వేసి కరెంటు స్తంభాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 50 ఫీట్ల రోడ్డును కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. ఆ దారి గుండా మల్లన్న గుడికి రైతులు వెళ్లకుండా కబ్జా చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకొని గుడికి వెళ్లే రహదారిని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో కోఆప్షన్‌ సభ్యులు మలాకిరత్నం, జగదీష్‌, మల్లేష్‌ యాదవ్‌, నరేష్‌ యాదవ్‌, ముత్యాలు, మల్లేష్‌ యాదవ్‌, రాములు యాదవ్‌, వినోద్‌ యాదవ్‌, బాబు యాదవ్‌ తదితరులు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు.