ఉద్యమంలో ఎన్నారైల పాత్ర అమోఘం

– రాష్ట్రాభివృద్ధికి సహకరించండి : అమెరికాలో మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర అమోఘమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. ఎన్నో త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో అద్భుతాలను సృష్టించగలుగుతున్నామని విమర్శించారు. రాష్ట్ర ప్రగతి అప్రతిహతంగా కొనసాగుతున్నదని తెలిపారు. తన అమెరికా పర్యటనలో నాలుగోరోజైన శుక్రవారం వాషింగ్టన్‌ డీసీలో తెలంగాణ ఎన్నారైలు ఏర్పాటు చేసిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ పాల్గొన్నారు. ఎన్‌ఆర్‌ఐలు జయంత్‌ చల్లా, భువనేష్‌, రవి పల్లా, ఈశ్వర్‌ బండా తదితరులు ఉన్నారు. మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో బియ్యం విషయంలో గందరగోళం ఏర్పడిందన్నారు. ఆరునెలల ముందు నిల్వలు ఉన్నాయని చెప్పిన కేంద్రం…ఇప్పుడేమో నిల్వలు లేవంటూ ఎగుమతులు నిషేధించిందని విమర్శించారు.