అధికార పార్టీ వారికే దళితబంధా..?

Dalit bandh for the ruling party..?– గ్రామ పంచాయతీని ముట్టడించిన దళితులు
నవతెలంగాణ- ధర్మపురి
అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకే దళితబంధు ఇస్తున్నారని దళితులు గ్రామ పంచాయతీని ముట్టడించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్‌లో మంగళవారం జరిగింది.అర్హులైన వారికి దళితబంధు ఇవ్వడం లేదని, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే ఇస్తున్నారని స్థానిక సర్పంచ్‌, ఎంపీటీసలను నిలదీశారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గు రికి ఇచ్చారని ఆరోపించారు. అర్హులైన నిరుపేద దళితులం దరికీ దళితబంధు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ స్పందించి అర్హులందరికీ దళితబంధు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.