– మధ్యప్రాచ్య నిపుణుడు
– ఫర్హాద్ ఇబ్రహిమోవ్
మాస్కో : రష్యా, ఇరాన్ లు ”చరిత్రాత్మక ఒప్పంద”తో తమ సహకారాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకువెళ్లాయని మాస్కోకు చెందిన వాల్డారు డిస్కషన్ క్లబ్‌లో మధ్యప్రాచ్య నిపుణుడు ఫర్హాద్ ఇబ్రహిమోవ్ అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ శుక్రవారం మాస్కోలో ఒక ప్రధాన ద్వైపాక్షిక భద్రతా ఒప్పందంపై సంతకం చేశారు. రాబోయే 20 సంవత్సరాల పాటు ఈ ద్వైపాక్షిక ఒప్పందంతో ఏర్పడిన వ్యూహాత్మక భాగస్వామ్యం ఆధారంగా రష్యా, ఇరాన్ లు సమగ్ర భద్రత, నావికా, ఆర్థిక, మానవతా సహకారాన్ని పెంచుకుంటాయి.
”ఈ ఒప్పందం నిజంగా చారిత్రాత్మకం. రష్యా, ఇరాన్ లు పరస్పర సహకారంలో కొత్త స్థాయికి చేరుకున్నాయి”అని ఇబ్రహిమోవ్ అన్నారు. రెండు బ్రిక్స్ దేశాలు సారూప్య ప్రపంచ ద ృక్పథాలను కలిగివున్నాయని, ఇవి కీలక వ్యూహాత్మక భాగస్వాము లుగా ఉంటాయని ఆయన అన్నారు. మధ్య ప్రాచ్యంలో తమ సంబంధాలను అభివ ృద్ధి చేసుకోవా లనుకునే రష్యా ఇరాన్‌ను అత్యంత విలువైన భాగస్వామిగా చూస్తుంది. ”వాస్తవానికి, ఇరాన్ చాలా కాలంగా రష్యాను దాని అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాములలో ఒకటిగా భావిస్తోంది. కొన్నిసార్లు మాస్కోను మిత్రదేశంగా కూడా అభివర్నిస్తోంది” అని ఇబ్రహిమోవ్ పేర్కొన్నారు.
”అంతర్జాతీయ సంబంధాల వ్యవస్థలో కొత్త ప్రపంచ క్రమాన్ని ఏర్పరచడంలో సహాయపడే శక్తిగావుండే సామర్థ్యం ఇరాన్ కు ఉందని రష్యా భావిస్తోంది” అని ఆయన అన్నారు. ప్రపంచంలోఅమెరికాను సవాలు చేయగల దేశాలలో రష్యా ఒకటి అని, టెహ్రాన్ అమెరికాను ”మొత్తం ప్రపంచం, ముఖ్యంగా మధ్యప్రాచ్యం భద్రతకు అతిపెద్ద ముప్పు”గా చూస్తుందని ఆయన అన్నారు. దశాబ్దాలుగా పాశ్చాత్య ఆంక్షల కింద నివసిస్తున్నందున, ఒప్పందంలోని ఆర్థిక సహకార నిబంధనలు ఇరాన్‌కు చాలా ముఖ్యమైనవి అని ఇబ్రహిమోవ్ అన్నారు. అయినప్పటికీ, ఒప్పందంలోని భద్రతా అంశాలు ప్రత్యేకంగా ఏ దేశానికి వ్యతిరేకంగా లేవని ఆయన నొక్కి చెప్పారు.
శుక్రవారం క్రెమ్లిన్ వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన ఒప్పందం ప్రకారం, రెండు దేశాలపై దాడి జరిగితే రష్యా, ఇరాన్ లు దురాక్రమణదారునికి – సైనికంగా లేదా ఇతరత్రా – ఎలాంటి సహాయం అందించవు. ”ఈ కుదిరిన ఒప్పందాలు రష్యా-ఇరాన్ సంబం ధాలు మరింత బలోపేతం చేయడానికి దోహద పడతాయి”అని పుతిన్ శుక్రవారం పెజెష్కియన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో అన్నారు.