మండారి ప్రభాకర్‌ ఉద్యమ త్యాగం వెలకట్టలేనిది

– బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు
నవతెలంగాణ-అర్వపల్లి
మండారి ప్రభాకర్‌ చేసిన ఉద్యమ పోరాటం వెలకట్టలేనిదని బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.పర్వతాలు అన్నారు.ప్రభాకర్‌ నాల్గో వర్థంతి సందర్భంగా మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ప్రభాకర్‌ స్థూపానికి కుటుంబసభ్యులతో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభాకర్‌ సూర్యాపేట జిల్లాలో జరిగిన అనేక అస్థిత్వ ఉద్యమాలకు తలమానికంగా నిలబడ్డారన్నారు.బాల్యం నుండి అభ్యుదయ సమాజం కోసం పాటుపడ్డారన్నారు.మలిదశ తెలంగాణ ఉద్యమం నుండి తెలంగాణ ఏర్పాటు క్రమంలో తన ఆశయాలు నెరవేరుతాయని ఆశించారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ జిల్లా చైర్మెన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌,బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు గాజుల శ్రీనివాస్‌,సీపీఐఎంఎల్‌ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్‌ కుమార్‌,సిపిఐ ఎంఎల్‌ రామచంద్రన్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి బుద్ధ సత్యనారాయణ, బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు బుడిగ మల్లేష్‌,సీపీయూఎస్‌ఐ రాష్ట్ర నాయకులు గద్దపాటి సురేందర్‌, చామకూరి నర్సయ్య, బొడ్డు శంకర్‌, కనుకుంట్ల సైదులు, వెంకటయాదవ్‌, తిరుపతి, శ్రీకాంత్‌గౌడ్‌, విజరు, రాగి మురళి, దాస్‌ ప్రభాకర్‌ సహచరి నిర్మల, కుమారులు ఏకలవ్య, ఆజాద్‌,ప్రజాసంఘాల నాయకులు,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.