– అమెజాన్ ప్రతినిధి రంజిత్ బాబు వెల్లడి
హైదరాబాద్: తెలంగాణలో టివిల అమ్మకాలు ఎక్కువగా జరుగు తాయని అమెజాన్ ఇండియా స్మార్ట్‌ఫోన్స్ అండ్ టెలివిజన్స్ డైరెక్టర్ రంజిత్ బాబు అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడు తూ.. పండుగల సమయంలో టివిల విక్రయాల్లో రెండు రెట్ల వృద్థి చోటు చేసుకుందన్నారు. 5జి స్మార్ట్ ఫోన్స్ విక్రయాల్లో 60 శాతం వృద్థిని నమోద వుతుందన్నారు. అక్టోబర్ 26 నుంచి అమెజాన్ ఎక్స్‌పీరియన్స్ ఎరీనాతో ప్రత్యేక రాయితీలు అందిస్తు న్నామన్నారు. నో కాస్ట్ ఇఎంఐ, బ్యాంక్ డిస్కౌంట్‌లు, రివార్డ్స్, క్యాష్‌బ్యాక్, ఎక్చేంజ్ ఆఫర్లను అందిస్తున్నామన్నారు.