ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ లొ పెట్టాలి

– ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమవేశాల్లో ప్రవేశ పెట్టాకపోతే చరిత్రలో బీజేపీ దోషిగా నిలవడం ఖాయం…!

– బీజేపీ మాదిగల ఆకాంక్షను నెరవేర్చి అండగా ఉంటారో లేక మాదిగలు శత్రువుగా మిగిలిపోతారో తేల్చుకోవాలి…!
– ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు పెట్టకపోతే బీజేపీ మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు..!
– ఎం ఎస్ పి, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి
నవతెలంగాణ- కంటేశ్వర్
ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టకపోతే చరిత్రలో బీజేపీ దోషిగా నిలవడం ఖాయమని బీజేపీ మాదిగల ఆకాంక్షలు నెరవేర్చి అండగా ఉంటారో లేక మాదిగలకు శత్రువులుగా మిగిలిపోతారో తేల్చుకోవాలి అని ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టకపోతే బిజెపి ప్రభుత్వము మాదిగల ఆగ్రానికి గురికాక తప్పదని ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ప్రస్తుత ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలోఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడించారు. ఈ సందర్భంగా ఎం ఎస్ పి జిల్లా ఇంఛార్జి గందమాల నాగభూషణం మాదిగ మాట్లాడుతూ.. గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన బీజేపీ. ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో వర్గీకరణ బిల్లును పెట్టి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన మాదిగల ఆకాంక్షను నెరవేర్చి అండగా ఉంటారో లేక మాదిగలు శత్రువుగా మిగిలిపోతారో బిజెపి తేల్చుకోవాలని హెచ్చరించారు. ప్రధాన మంత్రి మోడీ బీజేపీ అగ్ర నాయకత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే మాదిగల ఆగ్రహానికి గురికావడం ఖాయం మని మండిపడ్డారు. ఎంఎస్పి జిల్లా కో ఆర్డనేటర్ డాల్ల సురేష్ మాదిగ మాదిగ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తె వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని 9 ఏళ్లుగా మాదిగలను మోసం చేస్తూ కాలయాపన చేస్తుందని మండిపడ్డారు.ఈ రోజు పార్లమెంట్ సమావేశం చివరి రోజు కాబట్టి బిజెపి వర్గీకరణ పెట్టకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. ఎం ఎస్ పి పార్టీ సీనియర్ నాయకులు మైలరం బాలు మాదిగ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం సమానత్వం కోసం డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులను దళితు లందరికీ అందాలంటే ఎస్సీ రిజర్వేషన్ల ఏ బి సి డి వర్గీకరణ జరగాలని డిమాండ్ చేశారు. తద్వారా 59 కులాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. మాదిగ మాదిగ ఉపకులల ప్రజలకు ఎస్సీ వర్గీకరణ లేకపోవడం వల్ల విద్య ఉద్యోగాలలో సాంఘిక సంక్షేమ రంగాలలో అభివృద్ధి నోచుకో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి,కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలు వర్గీకరణపై అనేక మార్లు హామీ ఇచ్చాయని గుర్తుకు చేశారు. మాదిగల ఓట్లు వేయించుకొని ఎస్సీ వర్గీకరణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇది ఏమి పద్ధతిని ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో అన్ని పార్టీలు చిత్తశుద్దితో చొరవ చూపాలని లేని పక్షంలో మాదిగల హృదయాలలో ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ రూరల్ నియేజకవర్గ కన్వీనర్ చెవూరి శ్యామ్ మాదిగ, ఎం ఎస్ పి అర్బన్ నాయకులు యదశి రాములు, ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి లక్స్మంగరి భూమయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్  జిల్లా ఉపాధ్యక్షులు ఆకారం రమేష్ మాదిగ, చంటి అమర్ మాదిగ నాయకులు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ నాయకులు తదితరులు ధర్నా  లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.