రెండవ విడత గొర్రెల పంపిణీ చేయాలి..

నవతెలంగాణ దండేపల్లి: తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమలకు ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించి రెండో విడతలు లబ్ధిదారులకు మొండి చేయి చూపిందని రెండో విడత గొర్రెల పంపిణీ త్వరగా  పూర్తిచేయాలని దండేపల్లి వెంకటేశ్వర గొర్రెల పెంపకదారుల సహకార సంఘం అధ్యక్షుడు అల్లంల కుమారస్వామి యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సంఘ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.. మొదటి విడత లో రానివారు రెండవ విడత కొరకు ఎదురుచూస్తున్నారని మళ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ప్రభుత్వం మంజూరు చేస్తుందో చేయదని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారని అన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కొరకు డీడీలు చెల్లించి ఏళ్లు గడుస్తున్న ఇంకా పంపిణీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి అన్ని గ్రామాలకు రెండవ విడత గొర్రెలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి గోట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గడ్డి తిరుపతి, సభ్యులు రాంపల్లి మహేష్, గొట్ల శ్రీధర్, మల్లేష్, సత్తన్నలు పాల్గొన్నారు.