– ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తపాల ఉద్యోగుల సర్వీస్‌ను క్రమబద్దీకరించాలని ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం జాతీయ నాయకులు వెంకటేశ్వర్లు, రైల్వే ఉద్యోగుల సంఘం నాయకుడు యాదవరెడ్డి బోయినపల్లిని కలిసి పలు అంశాలపై చర్చించారు. నవంబర్ 19 నుంచి మూడు రోజుల పాటు హనుమకొండలో నిర్వహించనున్న జాతీయ స్థాయి గ్రామీణ తపాలా ఉద్యోగుల మహాసభకు హాజరు కావాలని సంఘం నేతలు ఈ సందర్భంగా వినోద్ కుమార్‌ను ఆహ్వానించారు. గ్రామీణ తపాల ఉద్యోగులది ప్రజలతో గొప్ప అనుబంధమని వినోద్‌కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. వీరు కేంద్ర ప్రభుత్వ నిరాదరణకు గురవుతున్నారని తెలిపారు. వారి జీవనం దుర్భరంగా తయారయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.