వీఆర్‌ వన్‌ ఫౌండేషన్‌ సేవలు అభినందనీయం

– ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య డీఈవో సుషిందర్‌ రావు
– విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయాలి వీఆర్‌ వన్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి
నవతెలంగాణ-మంచాల
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వీఆర్‌ వన్‌ ఫౌండేషన్‌ చేస్తున్న సేవలు అభినందనీయమని రం గారెడ్డి జిల్లా విద్యాధికారి సుసిందర్‌ రావు అన్నారు. గురు వారం మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో 2022-23 సంవత్సరంలో పదో తరగతిలో ఉన్నత మా ర్కులు సాధించిన విద్యార్థులకు వీఆర్‌ వన్‌ ఫౌండేషన్‌ ఆ ధ్వర్యంలో ప్రతిభ పారితోషికాలు అందజేశారు. ఈ సం దర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చ దువుతున్న విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి పారితో షికాలు అందజేయడం మంచి పరిణామమన్నారు. ప్రభు త్వ పాఠశాలల్లో ప్రతిభ ఉన్న ఉపాధ్యాయులు ఉంటార న్నారు. పాఠ్య పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం, విశాలమైన తరగతి గదులు, క్రీడాస్థలం ఉంటాయని తెలి పారు. అంతేకాకుండా ప్రభుత్వం ‘మన ఉరు-మన బడి’ కార్యక్రమం ద్వారా పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తోందన్నారు. వీఆర్‌ వన్‌ ఫౌండేషన్‌ చైర్మెన్‌ వెంకటేశ్వ రరెడ్డి మాట్లాడుతూ ఆరేండ్ల నుంచి వీఆర్‌వన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహి స్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్ర మాలు నిర్వహిస్తామని చెప్పారు. 2022-23 సంవత్స రంలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలిక్‌ లేటర్లను, ప్రశంసాపత్రాలను, నగదు, నోట్‌ బుక్స్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ వన్‌ ఫౌండేషన్‌ కార్యదర్శి డాక్టర్‌ భిక్షపతి, ఎంఈఓ వెంక ట్‌రెడ్డి, జాపాల్‌ సర్పంచ్‌ సయ్యద్‌ నాహీదా రావుఫ్‌, రం గాపూర్‌ సర్పంచ్‌ దబ్బికార్‌ మమత అజరుబాస్‌, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు,వీఆర్‌వన్‌ ఫౌండే షన్‌ సభ్యులు అష్వాల బాల్‌రాజ్‌, విద్యార్థుల తల్లి దండ్రులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.