ఉచిత వైద్య శిబిరానికి అనుహ్య స్పందన..

– అరోజులను తలచుకుంటే భయమేస్తుంది..
– కరోనా సమయంలో వైద్యులందించిన సేవలు వెల కట్టలేనివి…
– జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా కరోనా బాధితులకు వైద్య సిబ్బంది అంది దించిన సేవలు వెల కట్టలేనివని, నేడు అ రోజులను తలచుకుంటే భయమేస్తుందని, అంత భయంకరంగా ఉన్నప్పుడు ఎందరికో ప్రాణం పోసరని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అన్నారు. ఆదివారం డిచ్ పల్లి మండలంలోని సాంపల్లి గ్రామంలో ఐఎంఎ నిజామాబాద్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ‘పల్లెకు పోదాం పదా.. కార్యక్రమంలో భాగంగా రూరల్ మెగా హెల్త్ క్యాంపు ప్రారంభోత్సవనికి జడ్పీ చైర్మన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. కరోనా సమయంలో తమ కుటుంబాలను లెక్క చేయకుండా కరోనా బారిన పడిన వారిని ఎంతోమందిని రక్షించారని గుర్తు చేశారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఐఎంఎ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యరంగానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న ఘనత సిఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ప్రధానంగా విద్యా, వైద్యానికి సిఎం కెసిఆర్ పెద్దపీఠ వేశారన్నారు. గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చిందన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుదర్శనం, ఐఎంఎ జిల్లా అధ్యక్షులు రాంచందర్, ప్రధాన కార్యదర్శి జలగం తిరుపతిరావు, కోశాధికారి రాజేంద్రప్రసాద్, వైద్యులు డాక్టర్ జీవన్ రెడ్డి, నరేంద్ర, కవితారెడ్డి, సుజాత, నాగమోహన్, సుభాష్, సాయిపవన్, పాండ్యన్, అరవింద్, అశోక్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు అంజనేయులు, సభ్యులు రాజశేఖర్,మండల రెడ్ క్రాస్ అధ్యక్షులు డాక్టర్ రవివర్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఉపసర్పంచ్ మోహన్, సాంపల్లి తండా సర్పంచ్ జగదీష్, సీనియర్ నాయకులు శక్కరికొండ కృష్ణలతో పాటు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.