
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని పాత బస్టాండ్ సమీపంలోని హనుమాన్ ఆలయం చుట్టూ గల వ్యాపార దుకాణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు మంగళవారం నాడు గ్రామపంచాయతీ కార్యాలయానికి తరలివెళ్లి గ్రామ సర్పంచ్ సురేష్ కు గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఆలయం చుట్టూ మద్యం సీసాలు పారవేస్తున్నారని మటన్ చికెన్ ముక్కలు వెయ్యడం పవిత్రమైన ఆంజనేయ స్వామి ఆలయానికి అవమానం జరుగుతుందని వ్యాపారాల పేరుతో మద్యం అమ్మకాలు మాంసం ముక్కలు పారవేయడం ఆలయం చుట్టూ ఎలాంటి వ్యాపార దుకాణాలు ఉండకుండా వెంటనే తొలగించాలని వినత్ పత్రంలో గ్రామస్తులు పేర్కొన్నారు. ఆలయం చుట్టూ పరిశుభ్రంగా ఉండే విధంగా గ్రామపంచాయతీ పాలకవర్గం గానీ పంచాయతీ అధికారులు గానీ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు గ్రామ ప్రజల ఫిర్యాదుకు తగిన చర్యలు తీసుకుంటామని గ్రామ సర్పంచ్ గ్రామ కార్యదర్శి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ వినతి పత్రం కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.