కార్మికులందరి నినాదం ‘ఐక్యత- పోరాటం’

కార్మికులందరి నినాదం 'ఐక్యత- పోరాటం'– రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) నినాదం ‘ఐక్యత-పోరాటం’ అనేది ఇప్పుడు కార్మికులందరి నినాదంగా మారిందని ఆ సంఘం రాష్ట్ర కమిటీ తెలిపింది. శనివారం ఎస్‌డబ్ల్యూఎఫ్‌ 45వ ఆవిర్భావదినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అన్ని ఆర్టీసీ డిపోలు, యూనిట్ల వద్ద సంఘం పతాకాన్ని నాయ కులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐక్య కార్మికో ద్యమ నిర్మాణంలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కృషిని ప్రస్తావిం చారు. ఎస్‌డబ్ల్యూఎఫ్‌ వ్యవస్థాపకులు, మాజీ రాష్ట్ర కార్యదర్శి వీ రాములు వనపర్తి డిపో వద్ద పతాకావి ష్కరణ చేసారు. నూతన ఆర్ధిక విధానాల అమలుకు వ్యతిరేకంగా, ఆర్టీసీ పరిరక్షణ కోసం 2001 లో 24 రోజుల సమ్మె, 2005లో జరిగిన ఐదు రోజుల సమ్మె, అంతకు ముందే జరిగిన రాయలసీమ సమ్మె, కరీంనగర్‌ జోన్‌ సమ్మెల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఎస్‌డబ్ల్యూఎఫ్‌ విశేష కృషి ఫలితంగా, కార్మికుల ఒత్తిడిలో నుంచే 2019లో 55 రోజుల చారిత్రాత్మక సమ్మె జరిగిందని గుర్తు చేసారు. ప్రభుత్వంలో టీఎస్‌ ఆర్టీసీ విలీనం, దానికి ముందు పరిష్కరించాల్సిన కార్మిక సమస్యలపై ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఎప్పటిక ప్పుడు గళమెత్తుతూ, కార్మికుల్ని చైతన్యవం తుల్ని చేస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి వీఎస్‌ రావు తెలిపారు. ఫెడరేషన్‌ ఉపాధ్యక్షులు బిక్షపతి తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎదుట పతా కావిష్కరణ చేశారు. సీఐటీయూ నాయకులు సుధా కర్‌, సోమన్న, ఏఐఆర్‌ టీడబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కోశాధికారి గంగాధర్‌, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.