
– లక్ష్మిపూర్-ఎల్లంపల్లి, గూడెం- కల్లేపల్లి మద్య నిలిచిన రాకపోకలు
నవతెలంగాణ-బెజ్జంకి
రోడ్ల నిర్మాణ పనుల్లో గుత్తేదారుల అలసత్వం.. రాకపోకలు సాగించే ప్రయాణీకులకు శాపంగా మారాయి. మండలంలో సోమవారం రాత్రి వర్షం జోరుగా కురియగా సుమారు 43 సెం.మీ వర్షపాతం నమోదైంది.వర్షపు నీటీ ఉదృతికి లక్ష్మిపూర్-ఎల్లంపల్లి, గూడెం-కల్లేపల్లి గ్రామాల మద్య ఇటీవల మట్టితో నిర్మాణం చేపట్టిన రోడ్లు గండ్లుపడ్డాయి.దీంతో అయా గ్రామాల మధ్య ప్రజల రాకపోకలకు మంగళవారం అంతరాయం ఏర్పడింది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నీరు మండలంలోని అయా గ్రామాల చెరువుల్లోకి చెరుతుండడంతో జలకళలను సంతరికుంటున్నాయి.
రాకపోకలకు మున్నాళ్ల మోక్షమే!
గుత్తేదారుల అలసత్వం వల్ల మండల కేంద్రానికి సాగించే రాకపోకలకు మున్నాళ్ల మోక్షమే వరించిదని లక్ష్మీపూర్ గ్రామ ప్రజలు వాపోతున్నారు.మండల కేంద్రానికి ప్రజలు రాకపోకలు సాగించే బేగంపేట ప్రధాన రోడ్డు కంకరతో ప్రమాధకరంగా మారగా పలువురు ప్రయాణీకులు లక్ష్మిపూర్ గ్రామం మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. రాత్రి కురిసిన వర్షపు నీరు వరద ఉదృతికి లక్ష్మిపూర్-ఎల్లంపల్లి, గూడెం-కల్లేపల్లి గ్రామాల మధ్య కల్వర్ట్ నిర్మాణాలు చేపట్టకపోవడంతో రోడ్లు కొట్టుకుపోయి గతంలో మాదిరిగానే యథా రాజా తధా శిష్య అనే చందగా మారిందని రాకపోకలు సాగించే ప్రయాణీకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటీకైనా సంబంధిత అధికారులు స్పందించి గుత్తేదారులు అలసత్వం వహించకుండా త్వరితగతిన కల్వర్టుల నిర్మాణాలు చేపట్టి రోడ్లను అందుబాటులోకి తీసుకువచ్చేల చర్యలు చేపట్టాలని ప్రయాణీకులు కోరుతున్నారు.