
– శైలి బెల్లాల్
నవతెలంగాణ- కంటేశ్వర్: అనాదికాలం నుంచి ఈ దేశంలో జన్మించిన కోట్లాదిమంది దేశభక్తుల యొక్క అంతరాత్మ ఈ మట్టిలోనే మమేకమై ఉందని,మనం పుట్టింది మొదలు చనిపోయేదాకా ఈ మట్టితోనే కలిసి జీవిస్తామని, చివరికి చనిపోయిన తర్వాత ఈ మట్టిలోనే కలిసిపోతామని అందుకే మన గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య భారత అమృతోత్సవాల ముగింపు స్మారకంగా ఢిల్లీలో నిర్మించ తలపెట్టిన జాతీయ స్మారకానికి దేశంలోని ప్రతీ గ్రామం నుంచి మట్టిని సేకరించాలని ఆ మట్టితోనే ఆ స్మారకాన్ని నిర్మించాలని సంకల్పించారన్నారు అని నెహ్రు యువ కేంద్రం ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ శైలి బెల్లల్ గురువారం తెలిపారు. నా దేశం నా మట్టి కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలోని మొత్తం గ్రామాల నుండి సేకరించిన మట్టిని జిల్లాకేంద్రానికి చేర్చారు, ఒక్కొమండలం మట్టిని ఒక్కో ఇత్తడి కలశంలో నింపి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని అన్ని మండలాల కళశాలను ఎంపిక చేయబడిన వాలంటీర్ల ద్వారా రేపు రాష్ట్ర స్థాయిలో రాజ్ భవన్ లో గవర్నర్ గారి అధ్యక్షతన జరగనున్న కార్యక్రమానికి పంపడం జరిగింది అక్కడ నుంచి రాష్ట్రం మొత్తం కళాశాల ఢిల్లీ కి చేరనున్నాయి. ఈ సందర్భంగా నిజామాబాద్ మండల మట్టిసేకరణ కార్యక్రమం ఈరోజు ఉదయం ఖిల్లా రఘునాథ చెరువు ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన తొలి తరం సైనికులకు గౌరవ సన్మానం చేసి వారి సేవలని కొనియాడారు. ఈ కార్యక్రమానికి అతిథుగా జిల్లా ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మా నాయక్మాజీ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘురాజ్, సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మోహన్, ఉపాధ్యక్షుడు మధు సూదన్, అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ రాజనర్సా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్త, నెహ్రూ యువ కేంద్ర సిబ్బంది, మట్టిని తీసుకొని అన్ని మండలాల నుంచి ఢిల్లీ కి వెల్లనున్న వాలంటీర్లు, అధికారులు, విద్యార్ థులు పాల్గొన్నారు.