తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం పార్టీచేసిన అభివృద్ధి ముద్ర అలానే ఉంది

– కాసాని బాగా పనిచేస్తున్నారు :టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంటుందనీ, తెలంగాణలో మళ్ళీ ఏదో ఒక రోజు కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరు తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయు డు ధీమా వ్యక్తం చేశారు. కాసాని జ్ఞానేశ్వర్‌ నాయకత్వాన తెలంగాణలో పార్టీ అద్భుతంగా పనిచేస్తున్నదని ప్రశంసించారు. నారా చంద్రబాబు నాయుడు 14వ సారి పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికైన సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాయం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో కాసాని జ్ఞానేశ్వర్‌ ఆధ్వర్యంలో అభిందన సభ ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు పూలబోకేలు అందజేసి, శాలువాతో ఘనంగా సన్మా నించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఈ సంవత్సరంలో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ నెలలో ఎన్నికలు జరు గుతాయని చెప్పారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో పుట్టిన ఈ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంకు ఉండడం చాల గొప్ప విషయం అన్నారు. తెలంగాణలో టీడీపీ చేసిన అభివద్ధి ముద్ర ఎప్పటికీ చేదిరిపోదన్నారు. హైటెక్‌ సిటీ సైబరాబాద్‌, ఐటీ మైక్రోసాఫ్ట్‌ ఇలాంటి అనే కంపెనీలు ఇప్పటికీ దూసుకు పోతున్నాయని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలిసికట్టుగా శ్రమిస్తే తెలంగాణ రాష్ట్రంలోనూ పూర్వవైభవం సాధించడం ఎంతో దూరం లేదని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో శతజయంతి ఉత్సవాలు జరుపు కున్న రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం అని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అనే క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. 1995 నుండి నేటి వరకు 14 సార్లు తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు. 28 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్నానని చెప్పారు. నాడు స్వర్గీయ ఎన్టీఆర్‌ బడుగు బలహీన వర్గాల, తెలుగు ప్రజల సంక్షేమం కోసమే ఈ పార్టీని స్థాపిం చారని పేర్కొన్నారు. తెలుగు ప్రజల కోసం పుట్టిన ఈ పార్టీ, తెలుగు ప్రజ లు ఎక్కడ ఉన్నా గర్వంగా చెప్పుకునేలా పాలన అందించారని కొనియా డారు. తెలుగు బిడ్డ అయిన పీవీ నరసింహారావు తరహా ఆర్ధిక సంస్కర ణలు..తెచ్చి ప్రజలకు అందించిన ఘనత నాదేనని తెలిపారు.
రాజమండ్రి సభ విజయవంతం: కాసాని
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ మాట్లా డుతూ రాజమండ్రిలో జరిగిన మహానాడు ప్రతినిధుల సభ, బహిరంగ సభ అద్భుతంగా జరిగిందన్నారు. ఊహించిన దానికంటే ఎక్కువగా లక్షల మంది బహిరంగ సభకు రావడం పార్టీకి, నాయకులకు మంచి ఊపిచ్చిం దన్నారు. దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందన్నారు. ఈ సభలో తెలంగాణ పార్టీ కో ఆర్డినేటర్‌ కంభంపాటి రామ్మోహన్‌ రావు , టీడీపీ జాతీయ క్రమశిక్షణ సంఘం సభ్యులు బంటు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.