
నవతెలంగాణ-గోదావరిఖని
తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 58, 59 ద్వారా మీ సేవలో ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, ఫ్రీగా పట్టాలు ఇస్తామని చెప్పి, 125 గజాల వరకు మాత్రమే ఉచితమని, మిగతా భూమికి లక్షల రూపాయలు దండుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కేశోరాం కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు సూర సమ్మయ్య అన్నారు. పాలకుర్తి మండల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క నిరుపేదకు కూడా పట్టా ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టాలు ఇస్తా అని ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు. సమావేశంలో పాలకుర్తి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తలారి శంకర్, కేశోరాం కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కాల్వ అంజయ్య యాదవ్, మాజీ ఉపసర్పంచ్ శంకర్ నాయక్, గండికోట వెంకటేష్, కలవేన శ్రీనివాస్, బూతగడ్డల రమేశ్, సంపంగి సంతోష్, కొమిరే శంకర్ ఉన్నారు.