ఎర్రబెల్లి దయాకర్ రావు హామీతో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ

నవతెలంగాణ- కంటేశ్వర్

ఎర్రబెల్లి దయాకర్ రావు ఆమెతో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ జరిగిందని సిఐటియు జిల్లా కార్యదర్శి నూజాన్ ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి దాసు ఐఎఫ్టియు సుధాకర్ తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లా పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయ అధికారిని జయసుధను వినతిపత్రం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి దాసు, ఐ ఎఫ్ టి యు సుధాకర్ మాట్లాడుతూ
గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె 34 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిందని, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీతో సమ్మె తాత్కాలిక విరమణ చేయాలని, రాష్ట్ర జేఏసీ 8 ఆగస్టు 2023 హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర జేఏసీ చర్చించి ప్రకటించిందని రాష్ట్ర *జేఏసీ కన్వీనర్ దాసు తెలిపారు. ఆగస్టు 10 తేదీన నిజామాబాద్ డిపిఓ కి జేఏసీ జిల్లా బృందం సమ్మె విరమణ లేఖ ను అందజేశారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో 07–08-2023చర్చలు సందర్భంగా మంత్రి ఇచ్చిన భరోసాతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక డిమాండ్లలో ఆర్థికేతర డిమాండ్లు కారాబాదు బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియామకం, పీఎఫ్ ఈఎస్ఐ, ప్రమాద బీమా, గుర్తింపు కార్డులు, ఎనిమిది గంటల పని విధానం, పండుగ వారాంతపు జాతీయ అర్జిత సెలవులు, సమ్మె విరమించిన వెంటనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాల పెంపు పెర్మనెంట్ తదితర కీలక డిమాండ్లను ముఖ్యమంత్రితో మాట్లాడి సానుకూలంగా పరిష్కరిస్తామని అందుకుగాను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తాను బాధ్యత తీసుకుంటామని ఈ హామీ మేరకు సమ్మెను విరమించవలసిందిగా రాష్ట్ర జేఏసీకి దయాకర్ రావు గారు విజ్ఞప్తి చేశారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 9 నుండి సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు రాష్ట్ర జేఏసీ నిర్ణయించిందని, దాసు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే కార్యరూపంలోకి తీసుకురావాలని దాసు ప్రభుత్వాన్ని కోరారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగ కార్మికులకు, సహకరించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు , జేఏసీ తరఫున తెలియజేశారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా పనిలోకి తీసుకోవాలని గ్రామ కార్యదర్శులకు సర్పంచ్లకు ఎండిఓ లకు తెలియజేస్తూ డిపిఓ జయసుధ జేఏసీ బృందంతో ప్రెస్ ముందు మాట్లాడారు., గ్రామపంచాయతీ జిల్లా నాయకులు జాకీర్ రాజేశ్వరి హనుమాన్లు ధర్మానందు శ్రీనివాస్ ప్రదీప్ పసియోద్దీన్ సాయిలు లక్ష్మి గంగాధర్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు వెంకటి, రమేష్,తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ( ఐఎఫ్టియు)జిల్లా ఉపాధ్యక్షులు భానుచందర్ కార్యదర్శి జేపీ.గంగాధర్ తెలిపారు. డిపిఓ కు కలిసిన బృందంలో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.