
పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసే వరకు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘం జిల్లా జేఏసీ చైర్మన్ వెంకట్ గౌడ్ గురువారం అన్నారు. రాష్ట్ర కార్మిక సంఘం పిలుపుమేరకు మండల కేంద్రంలో 8వ రోజు సమ్మె కొనసాగింది. కార్మిక సంఘం జిల్లా జేఏసీ చైర్మన్ వెంకట్ గౌడ్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతిరం సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్ గౌడ్ మాట్లాడుతూ…. జిపి కార్మికులను పది గంటలు వెట్టిచాకిరి చేయిస్తూ, నామమాత్రపు వేతనాన్ని అందజేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు 19 వేతనం, కార్మికులు మృతిచెందితే కుటుంబానికి రూ.10 లక్షలు అందజేయాలని, కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. సమ్మలో మండల నాయకులు శ్రీధర్, గంగరాజు, శంకర్, తదితరులు పాల్గొన్నారు.