
నవతెలంగాణ- డిచ్ పల్లి
జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం లో భాగంగా తెలంగాణ గిరిజన బాలికల పాఠశాల, కళాశాలలో అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం ఇందల్ వాయి మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ అధ్వర్యంలో విద్యార్థులకు అల్బెన్దజోల్ మాత్రలు వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలాల్లోని మొత్తం 28 వేల 337 మంది విద్యార్థులకు అల్ఫేన్దజోల్ మాత్రలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు అన్ని అంగన్వాడి కేంద్రాల్లోనూ, ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సర విద్యార్థులు 19 సంవత్సరాలు లోపు విద్యార్థులందరికీ ఈ అల్బెన్దజోల్ మాత్రలు వేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగిస్తున్నమని పేర్కొన్నారు.1-2 సంవత్సరం పిల్లలకు సగం మాత్ర అనగా అల్బెన్దజోల్ మాత్ర 200 ఎం.జి ,మరియు 2-19 సంవత్సరం పిల్లలకు ఒక మాత్ర అనగా అల్బెన్దజోల్ మాత్ర 400 ఎంజి ఇవ్వడం జరుగుతుందని శంకర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, ఆశా కార్యకర్త బండ ప్రమీల, పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు శ్రీలత, అంగన్వాడీ కార్యకర్తలు వనజా, నర్సు సీత తోపాటు తదితరులు పాల్గొన్నారు.