
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు బదిలీలు చేయాలని కోరుతూ గురువారం రోజు ప్లకార్డులు పట్టి నిరసన వ్యక్తం చేశారు. గత 11 సంవత్సరాలుగా ఒకే చోట ఉద్యోగం చేస్తున్నామని పాఠశాల ప్రారంభం నాటి నుండి ఇక్కడే పని చేస్తున్నామని తమకు బదిలీలు చేయాలని కోరుతూ షార్ట్ టైంలో నిరసన వ్యక్తం చేశారు. సంబంధిత ఉన్నత అధికారులు చొరవ చూపి తమ సమస్య పరిష్కరించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.