హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు అరెస్ట్

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
అక్బర్పేట్ భూంపల్లి మండల కేంద్రంలోని కూడ వెళ్లి గ్రామ రామలింగేశ్వర స్వామి టెంపుల్ లో గతంలో రెండుసార్లు దొంగతనానికి పాల్పడి, ఇటీవల వారం రోజుల క్రితం టెంపుల్ లోని హుండీని ఎత్తుకెళ్లి హుండీ పగలగొట్టి అందులోని డబ్బులను ఎత్తుకెళ్లిన నిందితులను గురువారం పట్టుకున్నట్లు దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ తెలిపారు. ఈమేరకు దుబ్బాక పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కూడవెల్లి టెంపుల్లో వరుస దొంగతనాలు జరుగుతున్న కారణంగా ఆలయ అర్చకులు సాకేత్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా… సీసీ కెమెరాలను ఆధారంగా నేరస్తుల గురించి ,పూర్తిగా ఆరా తీసి గురువారం రావుల రాజు (29) , కంపే మల్లేశం( 35) కాగా.. వీరిద్దరూ చల్మెడ గ్రామం నిజాంపేట మండలం మెదక్ జిల్లా కు చెందినవారని పట్టుకున్నామన్నారు.నిందితుడు రాజు పై గతంలో కూడా అనేక దొంగతనాలకు పాల్పపడి జైలుకు వెళ్లి వచ్చారన్నారు. గత నవంబర్ నెలలో జైలు నుండి రిలీజ్ కాగా… అదే గ్రామానికి చెందిన కంపే మల్లేశం తో కలిసి దొంగతనాలకు పాల్పడటాన్ని అక్బర్పేట్ భూంపల్లి ఎస్ఐ గంగరాజు , సిబ్బంది సాయి కృష్ణ రాజిరెడ్డిలు కలిసి దొంగలను పట్టుకున్నారని పేర్కొన్నారు.వీరిపై రామయంపేట్ మెదక్ , భూంపల్లి మండల పరిసర ప్రాంతాలలో కేసులు నమోదయ్యాయని అన్నారు.నిందితుల నుండి టీవీఎస్ ఎక్సెల్ బైక్ , కూడవెల్లి రామలింగేశ్వర ఆలయ హుండీలోని 3వేల రూపాయాలను, దొంగతనాలకు ఉపయోగించిన రెండు బైక్ లను స్వాధీనం చేసుకొని నేరస్తులపై మొత్తంగా 7 కేసులలో అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచి కోర్టుకు రిమాండ్ చేశామన్నారు.చాక చక్యంగా దొంగలను పటుకోవడంలో అత్యుత్తమ ప్రదర్శన నిర్వహించిన ఎస్ ఐ భూంపల్లి గంగారజు క్రైమ్ కానిస్టేబుల్స్ సాయికృష్ణ రాజిరెడ్డి లను సీఐ కృష్ణ అభినందించారు.