– పోరాటాలే ప్రజా హక్కులను కాపాడుతాయి… జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ – దామరచర్ల
కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025 26 బడ్జెట్ పేదలకు మధ్యతరగతి ప్రజల వ్యతిరేకమైన బడ్జెట్ అని ,ఇది కార్పోరేట్ శక్తులకు లాభాలు చేకూర్చే విదంగా ఉన్నదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.దామరచర్ల లోని పార్టీ కార్యాలయం లో బుధవారం నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ సంపదను, కార్పొరేట్ శక్తులకు దోచుకునే విధంగా లాభాలు చేకూర్చే విధంగా ఉంది తప్ప ,ఓట్లు వేసినా కోట్లాదిమంది భారతీయులకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ లేదన్నారు. ముఖ్యంగా పేదల దగ్గర అత్యధికంగా వసూలు చేసిన జిఎస్టి బిల్లులు దోచి కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తున్నారని ,అదే సందర్భంగా నిరుద్యోగుల సమస్య పరిష్కరించే విధంగా ధరలు నియంత్రించే విధంగా ఈ బడ్జెట్ లేదన్నారు. దీనితోపాటు ఉపాధి హామీ పథకానికి నిధులు పెద్దగా పెంచలేదన్నారు. రైతులకు ఉపయోగపడే కనీస మద్దతు ఊసే లేదన్నారు. దళితులు గిరిజనులు ఆదివాసులు రక్షణ లేని బడ్జెట్ గా ఉంది ముఖ్యంగా సంపద సృష్టికి మూలమైన సంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు రక్షణ లేని బడ్జెట్ గా ఉందన్నారు విద్యా వైద్యానికి నిధులు ఆశాజనకంగా లేవు కావున కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టినుబడ్జెట్ను సవరించి ప్రజా ఉపయోగకరంగా ఉండే విధంగా కేంద్ర బడ్జెట్ ఉండాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి వినోద్ నాయాక్, పాపా నాయక్ దయానంద్ ఏర్రా నాయక్ కోటిరెడ్డి ఖాజా మొహిద్దిన్ సుభాని దుర్గయ్య శాంతమ్మ చంద్రకళ మట్టయ్య వెంకటయ్య కాంతారావు తదితరులు పాల్గొన్నారు