జమిలీ ఎన్నికల విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరైన విధానం కాదు అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం రాత్రి మండలంలోని కల్వలపల్లి గ్రామ శాఖ మహాసభ ను ఎర్ర గోపాల్ నగర్ లో ఈ మహాసభ నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2029 నుంచి ఒకే దేశం- ఓకే ఎన్నిక విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్లో ప్రవేశపెట్టడం ఫెడరల్ స్ఫూర్తికివిరుద్ధమన్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ జమిలి ఎన్నికల పద్ధతి అనుకూలం కాదు అని చెప్తు వస్తున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్వహరిస్తుందని ఆయన విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని, వాళ్ల ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటికరన చేయడానికి ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. గత ఎన్నికల ముందు బీజేపీ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాననిహామీ ఇచ్చి, హామీని తుంగలో తొక్కారన్నారు. రానున్న రోజుల్లో బీజేపీని గెలవకుండా అందరము శాయశక్తుల కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం రాముడు పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. గత ఎన్నికల ముందుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుప్రజలకు ఇచ్చినహామీలనువెంటనే అమలు చేయాలన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం6 గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంఇచ్చిన హామీలలోరైతు భరోసా, రుణమాఫీ కొంతమంది మాత్రమే రుణమాఫీ చేశారని, మిగిలిన రైతులందరికీ కూడారుణమాఫీని వర్తింపజేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ దేశంలో బీజేపీ అనుసరిస్తున్నప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని అయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ కానీ రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కలవలపల్లి గ్రామంలో వివిధ వార్డులలో డ్రైనేజీ సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పక్క రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ బస్సు సౌకర్యం లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. నిలిపివేయబడిన బస్సును పునర్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభ వంటపాక రమేష్ అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మిర్యాల భరత్ , సాగర్ల మల్లేష్ , శివార్ల వీరమల్లు , పర్నె అమరేందర్ రెడ్డి, కన్నెబోయిన యాదయ్య , వీరమల్ల కృష్ణయ్య, వంటెపాక అయోధ్య , ఎర్ర మహేందర్ , ఎర్ర కనకయ్య తదితరులున్నారు . తదనంతరం వంటేపాక అయోధ్యను గ్రామ కార్యదర్శిగా ఏకోగ్రంగా ఎన్నుకున్నారు .