బీసీల ఐక్యత  ప్రతి ఒక్కరు కదలాలి..

నవతెలంగాణ- భీంగల్
బీసీల ఐక్యతకు ప్రతి ఒక్కరు కదలాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్  ఆదేశాల మేరకు  మంగళవారం భీంగల్ జేబీఎన్ ఫంక్షన్ హాల్ లో బీసీల చైతన్య వేదిక,నూతన కమిటీని ఏర్పాటు  చేశారు  .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  అబ్బగోని అశోక్ గౌడ్  హాజరయ్యారు.ఈ సందర్భంగా బీసీలను ఉద్దేశించి మాట్లాడుతూ బీసీలకు రావలసిన వాటా ప్రకారము చట్టసభలలో బీసీల రిజర్వేషన్లను తక్షణమే ప్రకటించాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా అన్ని పార్టీలు బీసీల దమాషా ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 57% బీసీలకు అసెంబ్లీ స్థానాలలో సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు రాజ్యాధికారం రావాలంటే బీసీలకే ఓటు వేసుకోవాలని  తెలిపారు. అదేవిధంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం భీంగల్ మండల అధ్యక్షుడు గంగారం మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలలో నూతన కమిటీలు ఏర్పాటు  చేసి అధ్యక్ష, ఉపాధ్యక్షులు కార్యదర్శులను  నియమించామన్నారు. త్వరలోనే భీంగల్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాల బీసీ నాయకులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.