ప్రజా నాయకురాలు సీతక్క గెలుపు ఖాయం

– కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవళిరెడ్డి
నవతెలంగాణ-మంగపేట
అధికార పార్టీలో లేకున్నా ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ నిత్యం వారికి అందుబాటులో ఉంటున్న ప్రజా నాయకురాలు సీతక్క ములుగు నియో జకవర్గం నుండి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందటం ఖాయమని ములుగు నియోజకవర్గ ఇంచార్జి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి కుచన రవళిరెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రం లో కాంగ్రెస్‌ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మైల జయ రాంరెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన రవళీ రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీిఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తా అని మాయ మాటలు చెప్పిన మహనీయుడని విమర్శించారు. రెండవ సారి జరిగిన ఎలక్షన్ల ముందు నిరుద్యోగ యువతీ యువ కులకు నిరుద్యోగభృతి ఇస్తాం, దళితులకు మూడు ఎకరాల భూమి, కేజీ టూ పీజీ తదితర హమిలు ఇచ్చి అమలుచేయలేదని అన్నారు. ఇప్పుడు మూడోసారి కూడా అమలుకానీ హామీలతో మాయమాటలు చెప్పి అధికారం కోసం డబ్బు సంచులతో ఎలక్షన్‌ కు వస్తున్నా రని అన్నారు. సీతక్కను టార్గెట్‌ చేస్తూ అన్ని విధాలా భయ బ్రాంతులకు గురిచేస్తూ డబ్బులతో కాంగ్రెస్‌ నాయకులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. మండలం లో సీతక్కకు అత్యధిక మెజారిటీ తీసుకొచ్చే విధంగా పార్టీ ఆరు గ్యారంటీ పధకాల గురించి తెలియజేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, మండల సీనియర్‌ నాయకులు, అన్నీ అనుబంధ సంఘాల నాయకులు, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.