గ్రామాలను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలని ఆర్మూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆలూరు మండలంలోని రాంచంద్రపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనంను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమేనాని, పచ్చని పల్లెలో రాజకీయా బేధాలు లేకుండా అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలని, ఎమ్మెల్యేగా అవినీతి చేయనాని, చేసే వాళ్ళను కూడా వదలానాని, పార్టీలు వేరు మానవ సంబంధాలు వేరు అని పార్టీలకు ఆతితంగా ఉండాలని, నాయకులు అందరూ ఆర్థికంగా బాగున్నారు అని, ప్రజలు కూడా అలాగే ఉండాలని అన్నారు. మొట్టమొదటి సారిగా గెలిచిన తర్వత గ్రామానికి రావడం జరిగింది అని ప్రతి గ్రామంలో విద్య, వైద్య, ఉపాధికి మొదటి ప్రాధాన్యం అని అన్నారు. ఈ కార్యక్రమలో స్థానిక సర్పంచ్ వెంకన్న, ఎంపిపి ప్రభాకర్, మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.