నవతెలంగాణ -పెద్దకొడప్ గల్
మండలంలోని తలాబ్ తాండకు చెందిన జాధవ్ ప్రేమదాస్ ఆర్మీ జవాన్ చెన్నై లో శిక్షణ పూర్తి చేసి స్వగ్రామం కు వస్తున్న సందర్భంగా గ్రామస్థులు జాతీయ రహదారి161 లోని అంజనీ గేటు వద్ద ఘానా స్వాగతం పలికారు. అక్కడి నుండి ద్విచక్రవాహనల ర్యాలీ అంజని గ్రామం మీదు నుండి శివపూర్ మీదుగా తలాబ్ తాండ వరకు కొనసాగింది.ఆర్మీ జవాన్ కు ఇంటికి చేరుకోగానే తల్లి లక్ష్మి బాయి కొడుకుకు అరతి ఇచ్చి తిలకం దిద్ది ముద్దాడింది. దింతో తాండ వసూలు భారత్ మాత కి జై అనే నినాదం చేయ్యడంతో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా జవాన్ తల్లి మాట్లాడుతూ తన కొడుకు భారత దేశనికి సేవ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కన్న కొడుకు ఆర్మీ జవాన్ గా దేశ సేవ చేయడం మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని ఆమె తెలిపింది. అనంతరం తాండ సర్పంచ్ మరియు జవాన్ కు శాలువ పులా మాలతో సన్మానించి స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గణపతి రావు .తాండ నాయక్ దేవిసింగ్, బిల్ సింగ్, మిత్రులు జగపతి, పండరీ, ప్రదీప్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.