బీసీ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే 

– డాక్టర్ తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-ధర్మసాగర్
బీసీల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జేయమని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో వేలేరు, ఐనవోలు, ధర్మసాగర్ మండలంలోని  బీసీ కులవృత్తులు మరియు చేతివృత్తిదారులకు కేసీఆర్ ప్రభుత్వం చేయూతగా రూ.1లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించే  చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ కులాలలో చేతివృత్తులు మరియు కులవృత్తులు చేసుకునే వారికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహకారం,ఆర్థిక చేయూత అందించాలని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బిసి కులవృత్తులు మరియు చేతివృత్తిదారులకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.మొదటి దాపాగా నియోజకవర్గానికి 300 మంది చొప్పున అందించాలని ఉద్దేశంతో 300 చెక్కులలో 205 చెక్కులు మొదటి విడతలో పంపిణీ  చేయడం జరిగింది అన్నారు.ఈరోజు మూడు  మండలాలకు సంబంధించిన 95 చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మన రాష్ట్ర సంక్షేమ పథకాలు నిలిచాయన్నారు.కుల వృత్తుల ఆర్థిక సహాయం పొందిన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ మండల ఎంపీడీవో జవహర్ రెడ్డి, వేలేరు జడ్పిటిసి చాడ సరిత వేలేరు ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి, మండల అధ్యక్షులు మునిగేల రాజు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, నియోజకవర్గ కోఆర్డినేటర్స్, మండల కోఆర్డినేటర్స్, మహిళ నాయకులు, గ్రామశాఖల అధ్యక్షులు, బిసి కులవృత్తులు మరియు చేతివృత్తుదారుల లబ్ధిదారులు మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు