ప్రజల సంక్షేమమే బీఆర్‌ఎస్‌ లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర

నవతెలంగాణ-భూపాలపల్లి టౌన్‌
ప్రజల సంక్షేమమే బి.ఆర్‌.ఎస్‌ లక్ష్యమని భూపాలపల్లి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు శాంతినగర్‌, హనుమాన్‌, నగర్‌ కాలనీలో ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి ఇంటింటి ప్రచా రం చేశారు. వీరితో పాటు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పాల్గొన్నారు. ఈసందర్భంగా బసవరాజు సారయ్య మాట్లా డుతూ గండ్ర వెంకట రమణారెడ్డిని భారీమెజారిటీ తో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపుని చ్చారు. ఈ సంద ర్భంగా గండ్ర మాట్లాడుతూ భూపా లపల్లిలో బీఆర్‌ఎస్‌ జండా ఎగరేయడం ఖాయమని అన్నారు. ఓపెన్‌ కాస్ట్‌ లో నష్టపోయిన ఇళ్లకు ప్రభుత్వాన్ని మెప్పించి డబ్బులు ఇప్పించామన్నారు. భూపాలపల్లి పట్టణంలో డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ, మైనారిటీ ఆశ్రమ పాఠశాల తీసుకు వచ్చా మన్నారు. రానున్న రోజుల్లో మరొక అవకాశం కల్పిస్తే భూపాలపల్లి పట్టణానికి మరింత అభివృద్ధి చేస్తానన్నారు. పట్టణ ప్రజలు ఒకటే ఆలోచించాలి అభివృద్ధి, సంక్షేమం సమ దృష్టితో సాగిస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో అవకాశం కల్పించాలని పనిచేసే ప్రభుత్వానికి, నాయకుడికి పట్టం కట్టాలన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఎస్‌.వెంకటరాణి సిద్దు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బుర్ర రమేష్‌ గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్‌, వార్డు అధ్యక్షుడు రడపాక రమేష్‌ లతోపాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.