మాజీ అధ్యక్షుడిని పరామర్శించిన విప్

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ బీఅర్ఎస్ మాజీ అధ్యక్షుడు ముదాం సత్తయ్య తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సత్తయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి, తాను అండగా ఉంటానని వారికి భరోసా కల్పించారు. ప్రభుత్వ విప్ వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, ఎంపీపీ గాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ గుడిసె యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ భగవంతు రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ సిద్ధిరాములు, ఆలయ కమిటీ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి, పట్టణ మాజీ సర్పంచ్ నాగభూషణం గౌడ్, ప్రజా ప్రతినిధులు నాయకులు ఉన్నారు.