నవతెలంగాణ ఆర్మూర్: పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నందు ఆంజనేయుల మందిరంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఇట్టి సందర్భంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజిత రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పండి వినిత పవన్, స్థానిక కౌన్సిలర్ వరలక్ష్మి లింబాద్రి కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.