– కాపాడిన కానిస్టేబుల్
నవతెలంగాణ-బేగంపేట్
కదులుతున్న ఎంఎంటీఎస్ రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు ఓ ప్రయాణికురాలు కిందపడగా వెంటనే రైల్వే రక్షక దళం పోలీసు కానిస్టేబుల్ అప్రమత్తమై మహిళను రక్షించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సరస్వతి అనే ప్రయాణికురాలు బేగంపేట రైల్వే స్టేషన్‌లో లింగంపల్లి ఫలక్ నామా ఎంఎంటీఎస్ రైలును కదులుతున్న సమయంలో ఎక్కుతున్న క్రమంలో అదుపుతప్పి కింద పడిపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే రక్షక దళం పోలీస్ కానిస్టేబుల్ సరిత హుటాహుటిన సరస్వతిని అక్కడి నుంచి లాగేయడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. సకాలంలో సరస్వతి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ సరితను రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు.. సరస్వతిని కాపాడిన దశ్యాలు సీసీ కెమెరాలలో నమోదయ్యాయి.