– ఏఐఆర్‌డబ్ల్యూఓ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహిళా రిజర్వేషన్ బిల్లు సాధికారత కంటే కంటితుడుపు చర్య మాత్రమేనని ఆల్ ఇండియా రెవల్యూషనరీ ఉమెన్స్ ఆర్గనైజేషన్ (ఏఐఆర్‌డబ్ల్యూఓ) అభిప్రాయపడింది. ఈ మేరకు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి దీప, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేశ్వరి, నాయకులు సుధా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళా వ్యతిరేక మనువాదానికీ మహిళా సామాజిక సాధికారత ఉంటుందా?అని ప్రశ్నించారు. ఆ బిల్లు రాబోయే ఎన్నికల్లో మహిళల ఓట్లను ఆకర్షించే రాజకీయ స్టంట్ మాత్రమేనని తెలిపారు. చిన్న పిల్లలకు చాక్లెట్ ఇచ్చి దాచుకో కానీ ఇప్పుడు తినకూడదు, మరో ఎన్నికల నాటికి మాత్రమే తినాలి అన్నట్టుగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఉందని విమర్శించారు. పాలకుల భ్రమలకు లోనుకాకుండా రాబోయే ఎన్నికల్లో మహిళా ఓట్లను కొట్టేసే కుట్రలను కనిపెట్టి వాటిని తొప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వానికి, పాలకులు చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.