మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతివ్వాలి

– బీఆర్‌ఎస్‌ గ్లోబల్‌ ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం సాగే పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు మద్దతివ్వాలని బీఆర్‌ఎస్‌ గ్లోబల్‌ ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల కోరారు. బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా మహిళా వింగ్‌ అధ్యక్షులు సంగీత ధూపాటి ఆధ్వర్యంలో సిడ్నీ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మహేష్‌ రిజర్వేషన్‌ బిల్లుకోసం మొదటి సారిగాప్రచారాన్ని ప్రారంభించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం దేశవ్యాప్తంగా మహిళలను ఐక్యం చేసి బిల్లు ను సాధిస్తామని బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి తెలిపారు. సిడ్నీలో జరిగిన కార్యక్రమంలో వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ గిరి రాపోలు, కన్వీనర్‌ రవిశంకర్‌ ధూపాటి , అమ్రీన్‌, గుల్షన్‌ ఆర, స్వప్న నెల్లీ, పరశరామ్‌ , అజాజ్‌, ఇస్మాయిల్‌, చిరాన్‌ పురంశెట్టి తదితరులు పాల్గొన్నారు.