నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలి

– ఎస్టీపీలపై ప్రాజెక్టు డైరెక్టర్‌ సమీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ నగరంలో జలమండలి నూతనంగా నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ)పై ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీధర్‌ బాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన ఈ సమీక్షలో ఆయన ఎస్టీపీల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీ విభాగం సీజీఎంలు, జీఎంలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.