
– కుటుంబ సభ్యులు ఆరోపణ ఆదుకోవాలని రోడ్డుపై శవంతో రాస్తారోకో…
నవతెలంగాణ అచ్చంపేట: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే వైద్య వికటించి చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని ఆసుపత్రి ముందు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం లింగాల మండలం కొత్తకుంటపల్లికి చెందిన మల్లేష్ అనే చెంచు యువకుడు అనారోగ్యానికి గురికావడంతో ఆదివారం ఉదయం 10.గంటలకు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చామని, గ్లూకోస్, వ్యాక్సిన్ ఇచ్చారని, మధ్యాహ్నం పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారని అక్కడ వైద్యులు పరిశీలించి, చనిపోయినట్లు నిర్ధారణ చేసినట్లు మృతుని భార్య ఎల్లమ్మ రోధిస్తూ ఆరోపించారు. బాదిత కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.