అనుమానస్పదంగా యువకుడు మృతి

నవతెలంగాణ-మల్హర్‌రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన పిట్టల రాహుల్‌ (22) అనే యువకుడు పంట పొ లాల్లో అనుమాస్పదంగా మృతిచెందిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రా మస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మూడు రోజులుగా రాహుల్‌ అదృశ్యం కాగా కుటుంబ సభ్యులు,గ్రామస్తులు గ్రామ శివారు పొలాల్లో వెతుకుతున్న క్రమంలో వరి పొలాల్లో అనుమాస్పదంగా రాహుల్‌ మృతిచెంది కనిపిం చాడు. కొయ్యుర్‌ పోలీసులకు సమా చారమివ్వ గా ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిం చారు. వరి పంటలను అడవి పందుల తాకిడి నుంచి రక్షించేందుకు అమర్చిన విద్యుత్‌ తీగ తగిలి రాహుల్‌ చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుని తండ్రి పిట్టల మల్లేష్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నటు పోలీసులు తెలిపారు.
న్యాయం చేయాలని ఆందోళన..
అక్రమంగా పొలాల్లో అడవిపందుల బెడదకు పెట్టిన విద్యుత్‌ తీగ షాక్‌ గురై చనిపోయిన రాహుల్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు,గ్రామస్తులు కొయ్యుర్‌ పోలిస్టేషన్‌ ముందు, ప్రధాన రహదారిపై ఆందో ళన చేపట్టారు. నిందితులపై చర్యలు తీసుకో వాలని రోడ్డుపై బైఠాయించారు. కాటారం సీఐ రంజిత్‌రావు ఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.