ఏత్తొండ లో దొంగతనం

నవతెలంగాణ- కోటగిరి: కోటగిరి మండలంలోని ఎత్తొండ గ్రామంలో గురువారం తెల్లవారుజామున గ్రామానికి చెందినమంత్రి పోశవ్వ w/o సాయిలు, 31.10.2023 నాడు వారి ఇంటికి తాళం వేసి ఆమె కూతురు ఇంటికి బోధన్ కి వెళ్లి,  02.11.2023 నాడు ఉదయం ఏడు  గంటలకు వచ్చి చూసే సరికి ఇంటి యొక్క తాళం పగులగొట్టి ఉండటముతో, లోపలికి వెళ్లి బీరువా తాళం పగులగొట్టి అందులో వున్న సుమారు లక్ష రూపాయల నగదు , తులమున్నర బంగారం , 20 తులాల పట్టా గొలుసులుగుర్తు తెలియని దొంగలు దొంగలించారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు, వారి ఇంటి పక్కన ఇంట్లో 20వేల నగదును దొంగలించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామంలోని సీసీ కెమెరాలు పరిశీలించి పోశవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. గ్రామంలో దొంగతనం జరగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.