– పట్నంతో అవసరమే లేకుండా చేశాం: మంత్రి హరీశ్‌రావు ట్వీట్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డయాలసిస్ సేవల కోసం హైదరాబాద్‌కే వెళ్లాలనే పరిస్థితులకు చరమగీతం పాడామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. డయాలసిస్ సెంటర్లను మూడు నుంచి 102కు పెంచామని గుర్తుచేశారు. సిర్పూర్ కాగజ్ నగర్, ఏటూరు నాగారం వంటి మారుమూల ప్రాంతాలకు సైతం డయాలసిస్ సేవలందుతున్నాయని తెలిపారు. ఇన్ఫెక్షన్లు సోకకుండా దేశంలోనే తొలిసారిగా సింగిల్ యూజ్ డయలైజర్ పద్ధతి అనుసరిస్తున్నామనీ, రోగులపై ఆర్థిక భారం పడకుండా ఆసరా పింఛన్, ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించామని తెలిపారు.