– కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యగం కల్పించాలి.
– ప్రభుత్వం వెంటనే 25 లక్షల ఎక్షిగ్రేషియ ప్రకటించాలి.
నవ తెలంగాణ- జక్రాన్ పల్లి :
జక్రన్ పల్లి మండల కేంద్రంలో దళిత యువతి తేజశ్రీ దారుణ హత్యను నిరసిస్తూ బి.ఎస్.పి పార్టీ, ఎమ్మార్పీఎస్, సిపిఎం, పి డి ఎస్ యు,మహిళ సంఘాలు, యువజన సంఘాలు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి తదనంతరం జాతీయ రహదారి44 రోడ్డు పై బయటాయించరు, అలాగే బస్టాండ్ నందు బయటయించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితున్ని కఠినంగా శిక్షించే విషయంలో ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తక్షణమే శిక్ష పడే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. దేశంలో రాష్ట్రంలో పేద దళిత వర్గాల బిడ్డల హత్యలు మానభంగాలు జరుగుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది అని మండిపడ్డారు. గతంలో ప్రియాంక రెడ్డి హత్య విషయంలో నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. ఆమె పేరు పై దిశ చట్టం వచ్చింది కానీ మా దళిత మాదిగ బిడ్డపై జరుగుతే ఎందుకు స్పందిస్తాలేరాని ప్రశ్నించారు.దళితుల పట్ల వివక్షత స్పష్టంగా కనిపిస్తుంది. మా బిడ్డల మానప్రాణాలకు లెక్క లేదా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నమనారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మరియు 25 లక్షల ఎక్సి గ్రేశియ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఐక్య కార్యాచరణ రూపందిస్తామని తేజ శ్రీ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ప్రచార కార్యదర్శి ఏర్రొల గంగాధర్, అడ్వకేట్ రాజు కుమార్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చేవురి శ్యామ్ మాదిగ, బీఎస్పీ జిల్లా కార్యదర్శి హరీష్ గురిజల, బీఎస్పీ రూరల్ ప్రధాన కార్యదర్శి నట్ట అనంత్, విజయ్ వారియర్, జిన్న సంపత్, మెగేష్, నట్టా సంజయ్, నట్ట మధు, ప్రజా పంత నాయకులు దేవరం, పి డి యస్ యూ అనిల్ దళిత సంఘాల నాయకులు, మహిళ సంఘాలు, యువజన సంఘాలు, కులసంఘలు తదితరులు పాల్గొన్నారు