ముంబయి : సీట్ల పంపకాల అంశంలో గందరగోళం నెలకొందన్న వార్తలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలే సోమవారం కొట్టిపారేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ థాకరేల మధ్య గతేడాది డిసెంబర్‌లో జరిగిన సమావేశంలో .. సీట్ల పంపంకంలోని అన్ని విషయాలపై స్పష్టత వచ్చిందని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై మరో 8-10 రోజుల్లో అధికారికంగా ప్రకటన వెలువడు తుందన్నారు. పొత్తులో ఉన్నందు న సీట్ల పంపిణీ ఫార్ములాలో హెచ్చు తగ్గులు వస్తుంటాయని చెప్పారు. డా. అంబేద్కర్ మనవడు, మాజీ ఎంపీ ప్రకాశ్ అంబేద్కర్ ఇండియా ఫోరం లో కీలక పాత్ర పోషిస్తారని మీడియా ప్రశ్నకు సమాధానమిచ్చారు.