నవతెలంగాణ-తుంగతుర్తి
మండల పరిధిలోని కేశవాపురం గ్రామ ఉపసర్పంచ్ తూము లింగయ్య చెక్‌పవర్ తొలగింపు విషయంలో రాజకీయ జోక్యం లేదని, కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ మిర్యాల అనిత జనార్దన్ అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.తనతో పాటు ఉపసర్పంచ్ తూము లింగయ్యతో కలిసి చెక్‌పవర్ కొనసాగుతూ నిధులను దుర్వినియోగం కాకుండా కొనసాగుతుండగా గత మూడు నెలల నుంచి గ్రామపంచాయతీ సిబ్బందికి వేతనాలు, సర్పంచ్ చేసిన బిల్లులకు ఆటంకాలు కలిగిస్తుండడంతో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించి ఉపసర్పంచ్ లింగయ్య చెక్‌పవర్‌ను తొలగించారన్నారు.ఇవేవీ తెలియకుండానే తమపై అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు.భేషరతుగా వెంటనే ఉపసర్పంచ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై గ్రామంలో బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు.