పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట సవరణకు ప్రతిపాదన లేదు

– కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట సవరణకు ప్రతిపాదన లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. లోక్‌సభలో ఒకప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పార్టీ ఫిరాయి ంపుల నిరోధక చట్టం పొందిపరిచిన రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను సవరించే ప్రతిపాదన లేదని అన్నారు.
ఎన్నికల ఓటింగ్‌ పద్ధతిలో సంస్కరణలకు ఆలోచన లేదు
దేశంలో ప్రస్తుతం ఉన్న ఎన్నికల ఓటింగ్‌ పద్ధతిలో ఎటువంటి సంస్కరణలకు ఆలోచించటం లేదని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. లోక్‌సభలో ఒకప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో ప్రస్తుతం ఉన్న ఎన్నికల్లో ఓటింగ్‌ పద్ధతిలో సంస్కరణలు తీసు కురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోందా ? అనే ప్రశ్నకు లేదని సమా ధానం ఇచ్చారు. జమిలి ఎన్నికలకు సంబం ధించి లా కమిషన్‌ పరిశీలనలో ఉంద ని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అసెంబ్లీ వ్యవధి పూర్తి కాని రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరపలేదని అన్నారు.
లోక్‌సభ రిజర్డ్వ్‌ స్థానాల పునర్విభజనపై ఎటువంటి కసరత్తు లేదు
లోక్‌సభ రిజర్డ్వ్‌ స్థానాల పునర్విభజనపై ఎటువంటి కసరత్తు లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. లోక్‌సభ రిజర్డ్వ్‌ స్థానాలకు తాజా డీలిమిటేషన్‌ కసరత్తు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించటం లేదని అన్నారు.