నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నిటిఅయోగ్ సమావేశంతో కొత్తగా నేర్చుకునేది ఏమి లేదని రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత విమర్శించారు. ఆదివారం హైదరా బాద్ బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆ సమావేశానికి 10 మంది ముఖ్యమంత్రులు రాలేదన్న విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. ఆయన లాంటి నేతలతో రాష్ట్రానికి ఒరిగేదేమి లేదని విమర్శిం చారు. బీజేపీ పాలనలో ధరలు, మతోన్మాదం బాగా పెరిగాయని అన్నారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డికి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ సచివాలయం ప్రారంభో త్సవంపై విమర్శలు చేసిన వారు పార్లమెంటు ప్రారంభోత్సవానికి ఎన్ని పార్టీలు? ఎంత మంది ఎంపీలు వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. తాము ప్రజా సమస్యల పరిష్కారంలో బిజీగా ఉంటే, బీజేపీ నాయకులు సోషల్ మీడియా నిర్వహణలో ఉన్నారని ఎద్దేవా చేశారు.