– రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
– కుషాయిగూడలో సన్ సీడ్ మల్టీ స్పెషాలిటీ
ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి
నవతెలంగాణ-కాప్రా
ప్రయివేటు హాస్పిటల్స్ కేవలం బిజినెస్ పరంగా కాకుండా పేద ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని.. అప్పుడే వైద్య వత్తి పట్ల నమ్మకం పెరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం కుషాయిగూడలో డాక్టర్ అన్వేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్ సీడ్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుషాయిగూడ పరిధిలో అత్యాధునిక సాంకే తిక పరికరాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయడం హర్షనీయమని అన్నారు. ధనార్జనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజా సేవ చేయాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆస్పత్రి చైర్మెన్ డాక్టర్ అన్వేష్ మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యా లతో 60 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేశామ న్నారు. పేదలకు నాణ్యమైన వైద్యంతో పాటు అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూసుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ కార్డు దారులకు, రిటైర్డ్ ఉద్యోగులకు 30 శాతం రాయితీ అందిస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా గర్భిణులకు మొదటి మూడు నెలలు డయాగసిస్, కన్సల్టెన్సీ, ఫార్మసీ సేవలలో రాయితీ కల్పిస్తున్నామన్నారు. లాప్రోస్కోపి, ఎండోస్కోపీ, న్యూరో సర్జరీ, కార్డియాలజీ, ఆప్తమాలజీ మొదలగు సేవలు అందుబా టులో ఉన్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా డీఎం అండ్ హెచ్‌వో పుట్ల శ్రీనివాస్, కార్పొరేటర్‌లు బొంతు శ్రీదేవి యాదవ్, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి, శాంతి సాయి జన శేఖర్, బన్నాల గీత ప్రవీణ్, నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు బండారి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న డీజీ నరసింహారావు, చెరుపల్లి సీతారాములు
సన్ సీడ్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు, మాజీ ఎమ్మెల్యే చెరుపల్లి సీతారాములు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా డీజీ నర్సింహారావు మాట్లాడుతూ ఆస్పత్రి ప్రారంభం సంద ర్భంగా డా. అన్వేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు,పేద ప్రజలు, నివసిస్తున్న ఈసీఐఎల్ ప్రాంతంలో హాస్పిటల్ పెట్టడం చాలా మంచి ప్రయత్నం అని అన్నారు. అన్వేష్ గతంలో నిమ్స్ హాస్పిటల్ లో పనిచేసినప్పుడు కూడా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం చేశారన్నారు. ఈసీఐఎల్ ప్రాంతంలో సన్‌సీడ్ హాస్పిటల్ యాజమాన్యం పేదలకు అండగా ఉంటారని, నాణ్యమైన వైద్యం అందిస్తారని ఆశిస్తున్నామన్నారు. పలు కార్పొరేట్ హాస్పిటల్స్ బిజినెస్ పరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.శ్రీని వాసులు, పి.సత్యం, మేడ్చల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోమటి రవి,జై చంద్రశేఖర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి. వెంక టేష్, రాథోడ్ సంతోష్, జర్నలిస్టు రాష్ట్ర నాయకుడు బసవ పున్న య్య, ఆస్పత్రి ఎండీ డాక్టర్ తేజస్విని, సీఈవో రాములు, డాక్టర్ భాను చందర్, డాక్టర్ లావణ్య, డాక్టర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.