– మెయిల్ వార్డ్ సరిపోక ఇబ్బందులు పడుతున్న బాధితులు
– విద్యుత్ సరఫరా సరిగా లేక ఇబ్బందులు
నవతెలంగాణ-కోదాడరూరల్
ప్రభుత్వాస్పత్రిలో వంద పడకల కల నెరవేరేనా అని పట్టణ వాసులు, నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో వంద పడకలు చేస్తామని హామీలు ఇచ్చి నెరవేర్చడం లో విఫలం అయ్యారని నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. నిత్యం 65 నెంబర్ జాతీయ రహదారిపై ఎక్కడో ఓ మూల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు వైద్యమందకా జిల్లా ఆస్పత్రులకు తరలించే క్రమంలో అనేకమంది మత్యువాత పడుతున్నారు. అదేవిధంగా బాలింతలు కూడా అనేకమంది 108 ద్వారా జిల్లా ఆస్పత్రులకు తరలించే క్రమంలో అంబులెన్స్‌లోనే ప్రసవాలు కూడా జరిగాయి.అయినా ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆస్పత్రిని 15 పడకల ఆస్పత్రికి తగ్గట్టుగా సిబ్బంది ఉండే విధంగా ఏర్పాటు చేశారు.డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని, విద్యుత్ సౌకర్యం సరిగా లేకపోవడం విద్యుత్ ట్రిప్ అవుతుందని దీంతో డయాలసిస్, స్కానింగ్‌ల కోసం వచ్చిన బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్త్రీల వార్డులో బాలింతలు అప్పుడే పుట్టిన చిన్న పిల్లలు ఉక్కపోత తాళలేక ఇంటి వద్ద నుండి కూలర్లు తెచ్చుకుని ఏర్పాటు చేసుకుంటున్నారు.ప్రభుత్వాస్పత్రిలో మెయిల్ వార్డు సరిపోక వరండాలో ఫ్యాన్లు ఏర్పాటు చేసి మరి వైద్యులు వైద్యం చేస్తున్నారు.ఆస్పత్రిలో మధ్యలో మరుగుదొడ్లు ఉండడం వలన దుర్వాసన వెదజల్లుతున్నాయని, స్కానింగ్ కోసం వెళ్లేటప్పుడు ముక్కు మూసుకొన వెళ్లాల్సిన పరిస్థితి దాపరించిందని రోగులు వారి బంధువులు తెలుపుతున్నారు.చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాలలో వంద పడకల ఆస్పత్రులు వేలుస్తున్నాయని కోదాడకు వంద పడకల ఆస్పత్రి ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు? .వంద పడకల ఆస్పత్రి అయితే అనేకమంది ప్రాణాలు నిలబడతాయని, 24 గంటలు వైద్య సదుపాయాలు ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు. అనేక మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వాస్పత్రిని 100 పడకలుగా మార్పు తీసుకురావాలని పట్టణ వాసులు కోరుకుంటున్నారు…
100 పడకల ఆస్పత్రిగా మార్చాలి
సీహెచ్ గోపాలకష్ణ-కోదాడ
పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వందపడకల ఆస్పత్రిగా మార్చాలి.నిత్యం 65 నెంబర్ జాతీయరహదారిపై ప్రమాదాలు జరుగు తూనే ఉన్నాయి.వారి ప్రాణాలు కాపాడడం కోసం అయినా వంద పడకల ఆస్పత్రిగా మార్చాలి. ముందు పడకల ఆస్పత్రి అయితే 24 గంటల వైద్యం అందడం వలన అనేకమంది ప్రాణాలు నిలబెట్టవచ్చు. .