ఇవి వినూత్నతలకు ఎంజి మోటార్‌ మద్దతు

న్యూఢిల్లీ: విద్యుత్‌ వాహన రంగంలో వినూత్నతను ప్రోత్సహించడానికి ఎంజి మోటార్స్‌ తీసుకున్న ఎంజి డెవలపర్‌ ప్రోగ్రామ్‌, గ్రాంట్‌ సీజన్‌ 4.0 ముగిసినట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ సీజన్‌లో 250కి పైగా దరఖాస్తులను అందుకున్నట్లు పేర్కొంది. ఇందులో 30 శాతం మహిళ ఔత్సాహికవేత్తల ఉత్పత్తులు ఉన్నట్లు తెలిపింది. ప్రథమంగా నిలిచిన 14 బృందాలను షార్ట్‌ లిస్ట్‌ చేశామని ఎంజి మోటార్‌ ఇండియా డిప్యూటీ ఎండి గౌరవ్‌ గుప్తా తెలిపారు. ఎంపికైన సంస్థలు, ఆవిష్కర్తలు, ఔత్సాహికవేత్తలకు అగ్రగామి సంస్థల సహకార సమన్వయంతో మద్దతును అందించనున్నామన్నారు.