– రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు అలా మాట్లాడితే ఎలా?:మంత్రి హరీశ్ రావు – నిమ్స్‌లో రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ప్రారంభం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వైద్యారోగ్యరంగంలో ప్రభుత్వం ఏమి చేయడం లేదని కొంత మంది హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారని వైద్యా రోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాజ్యాంగ పద వుల్లో ఉన్న వారు కూడా అదే విధంగా మాట్లాడితే ఎలా? అంటూ అసంతప్తి వ్యక్తం చేశారు. సోమవారం నిమ్స్‌లో రూ.35 కోట్లతో ఏర్పాటు చేసిన రోబోటిక్ సర్జరీ సిస్టంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జాతిపిత మహాత్మాగాంధీ చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు వినవద్దు అని చెబితే కొంత మంది మంచి చూడవద్దు, మంచి మాట్లాడవద్దు, మంచి వినవద్దు అన్నట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏమి చేయక పోతే నీట్ ఆల్ ఇండియా ర్యాంకర్లు నిమ్స్‌లో పీజీ చేసేం దుకు ఎందుకు ఎంపిక చేసుకుంటున్నారని ప్రశ్నించారు. పేదల పట్ల సీఎం కేసీఆర్‌కు అంకిత భావం ఉందని తెలి పారు. ఆ అంకితభావం ఉండబట్టే దేశంలోనే అత్యాధునిక రోబోటిక్ సర్జరీ పరిక రాన్ని ప్రభుత్వరంగ నిమ్స్ అస్పత్రిలో ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. రోబోటిక్ సర్జరీతో కోత తక్కువగా ఉండి రోగులు త్వరగా కోలుకుం టారని హరీశ్ రావు తెలిపారు. రోగులు ఉండాల్సిన సమయం కూడా తగ్గు తుందన్నారు. భారతదేశంలోనే అతి పెద్ద డయాలసిస్ సెంటర్ నిమ్స్‌లో ఉందని చెప్పారు. నిమ్స్‌లో కొత్త పరికరాల కొనుగోలు కోసం రూ.154 కోట్ల ఇచ్చినట్టు తెలిపారు. అంతే కాకుండా ఆరోగ్యశ్రీ నుంచి రావాల్సిన నిధులతో పాటు మరింత సహాయం అందిస్తున్నట్టు చెప్పారు.
నిమ్స్ 4 వేల పడకలతో దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రిగా రికార్డు స్థాపించ బోతున్నదని చెప్పారు. తెలంగాణ రాకముందు బోధనా సిబ్బంది సంఖ్య 111 ఉంటే దాన్ని 264కు, వైద్య విద్యార్థుల సంఖ్యను 82 నుంచి 169కి పెంచినట్టు తెలిపారు. ఓపీ 5 లక్షల నుంచి ఆరు లక్షలకు, ఇన్‌పేషెంట్ల సంఖ్య 26 వేల నుంచి 50 వేలకు, సర్జరీలు 12 వేల నుంచి 25 వేలకు, డయాలసిస్ లు 12 వేల నుంచి 72 వేలకు, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు 25 నుంచి 150కు పెరిగాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 25 ఏండ్లలో 661 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేస్తే రాష్ట్రం ఏర్ప డ్డాక తొమ్మి దేండ్లలో 753 చేసినట్టు తెలిపారు. మూలుగు మార్పిడి సర్జరీలు అప్పుడు 46 అయితే ప్రస్తుతం 154, మోకాలు మార్పిడి సర్జరీలు 134 నుంచి 1,444కు పెరిగాయని చెప్పారు. నిమ్స్‌కు 32 ఎకరాల భూమిని కేటాయించా మనీ, ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ.1,571 కోట్ల పరిపాలనా అనుమతినిచ్చినట్టు గుర్తు చేశారు.14 అంతస్థుల్లో 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.
హాఫ్ నాలెడ్జ్ కామెంట్లు అవి….
– నిమ్స్‌లో రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

Related posts: